ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గోగుండ అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు జరిగాయి. గత మూడు నెలల్లో వంద మంది మావోయిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు.
ఉదయం నుండి ఎదురు కాల్పులు జరుగుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లలో ఒకేరోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన చోట పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మార్చి 25న భద్రతా బలగాలకు మాయివోస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే.
Also Read:మోదీపై ట్రంప్ ప్రశంసలు..