AOBలో మరో ఎన్‌కౌంటర్..అగ్రనేతలు హతం

9
- Advertisement -

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతంలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు అగ్ర నాయకులు హతమయ్యారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల్లో ఏవోబీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, మరియు జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇతర మృతులను శ్రీను, అనిత, షమ్మిగా గుర్తించారు.

ఈ కీలక నేతల మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటు . భద్రతా బలగాలు నిర్దిష్ట సమాచారం మేరకు ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో కీలక నేతలు హతం కావడంతో ఏవోబీ ప్రాంతంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.

Also Read:సత్యసాయి శత జయంతి వేడుకల్లో మోదీ

- Advertisement -