ఆదర్శ్, హరితేజలకు మరో అవకాశం !

197
Another chance for big boss runner ups !
Another chance for big boss runner ups !
- Advertisement -

‘బిగ్ బాస్’ సీజన్ -1 ఫైనల్స్ వరకు వచ్చి అందరూ విన్నర్‌గా నిలుస్తాడకున్న ఆదర్శ్‌ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్‌ రన్నరప్‌ హరితేజ, సెకండ్‌ రన్నరప్‌ ఆదర్శ్‌లకు స్టార్‌ మా వారు మరో అవకాశం ఇచ్చారట. సెప్టెంబర్‌ 30 నుండి బిగ్ బాస్ స్థానంలో ప్రసారం అయ్యే ‘నీతోనే డాన్స్’ రియాల్టీ షోలో వీరికి అవకాశం దక్కినట్లు సమాచారం.

‘నీతోనే డాన్స్’ రియాల్టీషో అనేది కపుల్ థీమ్ తో సాగే రియాల్టీ షో. ఈ షోలో ఆదర్శ్, హరితేజ జంటగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. స్టార్ మాటీవీ వారు ఇప్పటికే హరితేజ, ఆదర్శ్‌తో డాన్స్ రియాల్టీ షోకు సంబంధించి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు రేణు దేశాయ్, జానీ మాస్టర్, ఆదా శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం అయితే లేదు.

ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుండి భయటకు వచ్చిన తరువాత ఓ ఇంటర్వ్యూలో ఆదర్శ్‌ మాట్లాడాడు. ‘‘బిగ్ బాస్’ ఫైనల్స్ వరకు వెళ్లిన తనకు గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నానని అయితే, రన్నరప్ గా నిలవడంతో ఆ క్షణంలో కొంచెం నిరాశ చెందానని తెలిపాడు. ‘బిగ్ బాస్’ ఫైనల్స్ వరకు రావడం చాలా సంతోషంగా భావించానని, ‘బిగ్ బాస్’ ముగియగానే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నన్ను ఉత్సాహపరుస్తూ నాకు చాలా ఫోన్ కాల్స్, మెస్సేజెస్ వస్తున్నాయన్నాడు. ఫ్యాన్స్ , సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకన్నా గెలుపు ఇంకేముంటుందని నాకు అనిపించింది’ అని ఆదర్శ్ చెప్పుకొచ్చాడు. అయితే రన్నరప్‌ నిలవడంపై నెగిటివ్ ఫీలింగ్స్ లేవని మనస్ఫూర్తిగా చెబుతున్నానని అన్నాడు.

- Advertisement -