చంద్రబాబుపై మరో కేసు.. బిగుస్తున్న ఉచ్చు?

31
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. దాంతో చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో అనే దానిపై కూడా క్లారిటీ లేదు. అసలే అధినేత జైల్లో ఉండడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పార్టీలో ప్రదాన నేతలంతా కూడా బాబును బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో దిక్కుతోచనిస్థితిలో టీడీపీ ఉండగా.. ములిగే నక్కపై తాటికాయ పడినట్లు మరో కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు హయంలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో భారీగా అవకతవకలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది. .

బ్లాక్ లిస్ట్ లో ఉన్నా టేరా స్టాప్ సంస్థకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, సెట్ టాప్ బాక్స్ ల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందని సీఐడీ చెబుతోంది. ఇందులో ముఖ్యంగా వేమూరి హరిప్రసాద్, అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ పాత్ర కూడా ఉన్నట్లు అభియోగాలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు కూడా చంద్రబాబు ఇరకాటంలో పెట్టె అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా చంద్రబాబుపై మరిన్ని కేసులు తెరపైకి వచ్చే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానే ఒక్కో స్కామ్ తెరపైకి వస్తోంది. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీని అవినీతి స్కామ్ లు చుట్టుముట్టడంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వైసీపీ నేతలు చేసే ఆరోపణలకు ధీటుగా జవాబిచ్చే టీడీపీ నేతలు ఈ స్కామ్ ల విషయంలో మాత్రం నోరు మెదపలేక పోవడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ కేసులు వెంటాడుతుండడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే చెప్పాలి.

Also Read:ANR Statue:ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

- Advertisement -