బంగ్లా మాజీ ప్రధానికి మరో ఏడేళ్ల జైలు శిక్ష

241
Khalida-Zia
- Advertisement -

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని,విపక్ష నాయకురాలు ఖలీదా జియాకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. విరాళాల రూపంలో ఆమె అవినీతికి పాల్పడిందని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఖలీదాకు ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

సుమారు 21 మిలియన్‌ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్‌ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు ఈ శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. మూడుసార్లు బంగ్లా ప్రధానిగా పనిచేశారు ఖలీదా.

ఈ కేసులో ఖలీదాకు తొలుత ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా మరో 7 సంవత్సరాల పాటు శిక్షను పొడిగించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆమె కుమారుడు తారిఖ్‌ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా  బంగ్లా న్యాయస్థానం పది సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -