కరోనా కొత్త వేరియంట్‌తో చైనా అతలాకుతలం అవుతోంది. చైనాలో ఇప్పటి వరకు 18.6 కోట్ల కరోనా కేసులు గుర్తించగా ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు లక్ష మంది వరకు వైరస్ బారినపడి మరణించారు.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిస్థితి తీవ్రరూపందాల్చే అవకాశం ఉందని అంచనా వేయగా చైనా తర్వాత జపాన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక న్యూఇయర్ వేడుకల తర్వాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
గత ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 9,847 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఒక్క జపాన్ లోనే ఏడు రోజుల్లో 2,188 మంది కరోనా కారణంగా మరణించారు.
ఇవి కూడా చదవండి..