రాష్ట్రంలో వానలు ఎడతెరపి లేకుండా దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
14 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని జక్లాత్ ఒర్రె రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. ఎరగట్ల మండలంలోని తీగల వాగు రోడ్డు పై నుంచి పొంగిపొర్లుతుంది. కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని…పిల్లల్ని నదులు వాగుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు అధికారులు. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే డైల్ 100 కు సమాచారం అందించాలన్నారు.