హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామానాయుడు స్టూడియోస్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) షాక్ ఇచ్చింది. ఈ స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజును తక్కువ చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపుతూ ఈ స్టూడియోలు భారీ మొత్తంలో పన్నులు ఎగవేతకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.అన్నపూర్ణ స్టూడియోస్ నిజంగా చెల్లించాల్సిన ఫీజు: రూ.11.52 లక్షలు.ప్రస్తుతం చెల్లిస్తున్నది: కేవలంరూ.49 వేలు.
రామానాయుడు స్టూడియోస్ వివరాలు:నిజంగా చెల్లించాల్సిన ఫీజు: రూ1.92 లక్షలు.ప్రస్తుతం చెల్లిస్తున్నది: కేవలం రూ.1,900 మాత్రమే.భారీ వ్యత్యాసంతో పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించిన GHMC అధికారులు, రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

