ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలలో పాల్గొన్న అన్నా లెజినోవా.. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.
ఈనెల 8న సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ కు స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.
•కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు.
•సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
•దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద… pic.twitter.com/KvVKjWh8A9
— JanaSena Party (@JanaSenaParty) April 14, 2025
Also Read:నిద్రలేమి సమస్య…అయితే!