ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయాల్లో ప్రారంభించిన పథకాల్లో ఒకటి అన్న క్యాంటీన్. పేదలకు మూడు పూటలా కేవలం రూ. 15కే 365 రోజుల పాటు కడుపునిండా భోజనం అందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్‌లకు మంచి స్పందన వచ్చింది.
అయితే చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ సోమవారం నుంచి మూతపడింది. ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో భోజనం చేసేవారి సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి అన్నా క్యాంటీన్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం జగన్ సీఎం కావడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య తగ్గింది. దీంతో వినియోగదారుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే అన్న క్యాంటీన్‌లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.