అంజయ్య కుటుంబానికి అండగా మంత్రి కేటీఆర్‌..

58
ktr

ఇటీవల కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామ రావు తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌ కలిసింది. అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మంత్రి కేటీఆర్ తెలిపారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.