పొన్నంపై అంజన్‌ కుమార్ ఫైర్

6
- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్. పొన్నం ప్రభాకర్ కంటే తాను సీనియర్ అని…జూబ్లీహిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. పొన్నం ప్రభాకర్ కాదు అని మండిపడ్డారు.

కేసీఆర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంని, హోమ్ మినిస్టర్‌ని చేశాడు.. నాయిని నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్‌ని చేశాడు…కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతో మంది ఉన్నారు అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి,కోమటిరెడ్డి బ్రదర్స్,మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆయన అన్న మల్లు రవి ఎంపీ,వివేక్ మంత్రి, ఆయన కొడుకు ఎంపీ, ఆయన అన్న ఎమ్మెల్యే..ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు.. నా కొడుకు ఎంపీ అయితే, నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు అంజన్.

Also Read:‘కాంతార’పై ఆర్జీవీ సంచలనం వ్యాఖ్యలు

- Advertisement -