ఏపీ క్యాడర్ కు చెంది తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇవాళే ఇది జరుగాలని పేర్కొంది.
ఉత్తర్వులు అందుకున్న వారిలో తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్, కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఉన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)… రెండు రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కేటాయించింది.
ఈ కేటాయింపులు సరిగ్గా లేవంటూ కొందరు అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. దీంతో డీఓపీటీ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఖండేకర్ కమిటీని నియమించింది. పలువురు ఐపీఎస్ లను ఏపీకి పంపించాలంటూ సదరు కంపిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ లను ఏపీకి వెళ్లాలని హోంశాఖ ఆదేశించింది.
Also Read:సిరిసిల్ల శ్రీనివాస్‌కు అండగా కేటీఆర్

