అంజలి ఇంట్లో దెయ్యం..!

196
Anjali’s ghost troubles
- Advertisement -

జర్నీ సినిమాతో అందరి మనసులను ఆకట్టుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాల‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం నుంచి దెయ్యాల సినిమాలనే ఎక్కువగా చేస్తోంది. అన్ని ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ అయిన హారర్ ఫిలిమ్స్ తో నటించి ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. కానీ ఇప్పుడు అంజలికి ఒక భయం పట్టుకుంది. రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో

అంజలి ఇంట్లో దెయ్యం తిరుగుతుంద‌న్న స‌మాచారం షాకింగ్‌గా మారింది. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలిలో అంజ‌లి ఉంటున్నారు.  అక్కినేని నాగార్జున కుమారుడు.. యూత్ హీరో నాగ‌చైత‌న్య నివాసానికి ద‌గ్గ‌ర్లోనే అంజ‌లి ఉంటున్నారు. ఈ ఇంటికి ద‌గ్గ‌ర్లో పిల్లులు పెద్ద ఎత్తున రావ‌టం.. రాత్రిళ్లు వింత వింత శ‌బ్దాలు వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదంతా దెయ్యం కార‌ణంగానే అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

రీల్ లైఫ్ లో ఎదురైన‌ట్లే.. రియ‌ల్ లైఫ్ లోనూ దెయ్యం సీన్ ఎదురుకావ‌టంతో.. ఆ ఇంటిని అర్జెంట్ గా ఖాళీ చేసి.. కొత్త ఇంట్లోకి మారిందట ఈ బ్యూటీ. దెయ్యాల దెబ్బకు ఇకపై హారర్ సినిమాల్లో నటించనే కూడదని ఫిక్స్ అయిపోయిందట. రీసెంట్ గా రెండు హారర్ సినిమాలకు ఆఫర్సే వస్తే… ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సినిమాలు చేయనని తెగేసి చెప్పిందట అంజలి. దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది దెయ్యాల ప్రభావం అంజలి పై బాగానే పడిందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

- Advertisement -