గుడి గుడికో ఓ జమ్మి చెట్టు: అంజయ్య యాదవ్

7
- Advertisement -

పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ కాన్ పేట గ్రామంలో గ్రీన్ చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో గ్రీన్ ఛాలెంజ్ ఫౌండేషన్ పిలుపు మేరకు జమ్మి చెట్టును నాటిన అనంతరం మాట్లాడారు.

తెలంగాణ ప్రాంతంలో జమ్మి చెట్టు అంతరించిపోతుందని విషయాన్ని గ్రహించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జమ్మి చెట్టును పెంచేందుకు చర్యలు తీసుకుందని, దీనికి తోడు పర్యావరణాన్ని పరిరక్షించడంలో మానవుడు ప్రధాన పాత్ర పోషించాలనే ప్రధాన ధ్యేయంతో గ్రీన్ చాలెంజ్ ఫౌండర్ సంతోష్ కుమార్ అడవులను పెంచేందుకు ముందుకు వచ్చారని, ఇందులో భాగంగానే గత ఆరు ఏడు సంవత్సరాలుగా విస్తారంగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. సంతోష్ కుమార్ పులుపు మేరకు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావడం మనందరికీ గర్వకారణంమని, రానున్న దసరా పండుగ నాటికి ప్రతి గుడి ముందు జమ్మి చెట్టు ఉండాలని కోరారు.

జమ్మి చెట్టు పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానం ఉందని, జమ్మి చెట్టుకు పూజలు చేస్తే మంచి జరుగుతుందనే నానుడి పాండవుల కాలం నాటి నుంచి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. నేటితరం యువత పర్యావరణం, చెట్ల ప్రాముఖ్యత, మన సంప్రదాయాలలో చెట్ల ప్రత్యేకత వంటి అంశాల పైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్ తరాలకు వన సంపదను అందించాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పర్యావరణ పరిరక్షణకై అన్ని వర్గాల ప్రజలు చెట్లను నాటేందుకు స్వయంగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సి, ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్ బీఆర్ఎస్ నాయకులు వెంకన్న యాదవ్, ఆంజనేయులు, సురేష్ యాదవ్, జమాల్ ఖాన్, ప్రేమ్, శ్రీ హారి యాదవ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Also Read:పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

- Advertisement -