నానితో అనిరుధ్‌ రవిచందర్!

2
- Advertisement -

వరుస బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో నాని. రీసెంట్‌గా సరిపోదా శనివారం సినిమాతో హిట్ కొట్టాడు నాని. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టిందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు.

ప్రస్తుతం దర్శకుడు శైలేష్ కొలనుతో సినిమా చేస్తుండగా ఇది పూర్తయిన తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Also Read:TTD: బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..

- Advertisement -