రణబీర్ కపూర్ ‘యానిమల్’ ప్రతి గ్లింప్స్ ప్రేక్షకులకు హ్యూమన్ ఎమోషన్స్ స్పెక్ట్రమ్‌ను అందిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రణబీర్ కపూర్ ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ తో ఇంటెన్స్ ప్రీ-టీజర్ తండ్రీ కొడుకుల మధ్య వున్న గ్రే డైనమిక్స్ ప్రజంట్ చేయగా.. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించింది. ఇప్పటివరకు విడుదల చేసిన సినిమాలోని పాటలు నేషనల్ వైడ్ గా చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. దాదాపు మూడున్నర గంటలు సినిమా రన్ టైం ఉండనుందని తెలుస్తుండగా దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించగా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.
Also Read:Harishrao:తెలంగాణలో దాడులకు తావులేదు