యానిమల్‌ 500 కోట్లు.. నాని కామెంట్స్ వైరల్

41
- Advertisement -

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా న‌టించిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌ ను ప‌రుగులు పెట్టిస్తున్న ఈ సినిమా తాజాగా రూ. 500 కోట్ల క్ల‌బ్‌ లో చేరింది. ‘యానిమల్’ వారం రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వ‌రల్డ్‌ వైడ్‌గా రూ.527 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనే దాదాపు రూ.285 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కొందరు హీరోలు కూడా యానినల్ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని చేసిన క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మీడియాతో ముచ్చటిస్తూ నాని ఈ కామెంట్స్ చేశాడు. యానిమల్ లాంటి కథ వస్తే అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు నాని స్పందిస్తూ.. ‘వంద శాతం. దసరా లాంటి కథలో నన్ను ఊహించకున్నారా ? చేస్తే గానీ ఊహించలేం. బహుశా అంత కంటే మ్యాడ్నెస్ (పిచ్చిగా) ఉన్న పాత్రలు చేస్తానేమో చెప్పలేం. సవాల్‌తో కూడుకున్న పాత్రలు, కథలు వచ్చినప్పుడు చేయడానికే ఇష్టపడతాను’ అని చెప్పాడు. నాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నాని, మృణాల్ ఠాకూర్ న‌టించిన హాయ్ నాన్న మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

తండ్రీకూతుళ్ల అనుబంధానికి బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీని జోడించి తెర‌కెక్కిన ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా OTT కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ..తెలుగుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల‌కు క‌లిపి 37 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. అన్నట్టు బాక్సాఫీస్ వద్ద హాయ్ నాన్న గొప్ప కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేక పోతుంది.

Also Read:కేసీఆర్ త్వరగా కోలుకోవాలి:చంద్రబాబు

- Advertisement -