యానిమల్…హార్డ్ హిట్టింగ్ ట్రాక్

4
- Advertisement -

చార్ట్ బస్టర్ నెంబర్ ‘అమ్మాయీ’ తర్వాత ప్రేక్షకులు, సంగీత ప్రియులకు మరింత ఉత్సాహన్ని ఇస్తూ ‘యానిమల్’ సెకండ్ సింగిల్ ‘నే వేరే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హ్యూమన్ ఎమోషన్స్ ని సరికొత్తగా హార్ట్ హిట్టింగ్ గా ప్రజెంట్ చేస్తూ, వివాహం తర్వాత తలెత్తే సంక్లిష్టమైన విభేధాలని ఈ సోల్ ఫుల్ ట్రాక్ లో చూపించారు.

కార్తీక్ పాడిన ‘నే వేరే’ పాట.. లీడ్ పెయిర్ రణబీర్ కపూర్, రష్మిక మధ్య అనుబంధం, విభేదాలను లోతుగా ఎక్స్ ఫ్లోర్ చేస్తోంది. ఈ పాటని శ్రేయాస్ పురాణిక్ స్వరపరిచగా.. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ప్రేమలోని సంక్లిష్టమైన అంశాలను హత్తుకునేలా చూపించింది. ఈ ట్రాక్ మానవ వ్యక్తిత్వ, విభిన్న కోణాలను రివిల్ చేస్తూ ‘యానిమల్’ కోర్ కి అద్దం పడుతుంది. ఈ ట్రాక్ సాంప్రదాయ సరిహద్దులను దాటి సినిమా యొక్క ఆకర్షణీయమైన, ఆలోచింపజేసే కథనంలో గ్లింప్స్ ని ప్రజెంట్ చేస్తోంది.

రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, ప్రతిభావంతులైన స్టార్ కాస్త నటించిన క్రైమ్ డ్రామా ‘యానిమల్’ హ్యూమన్ ఎమోషన్స్ ని వివిధ కోణాలను లోతుగా ఎక్స్ ఫ్లోర్ చేయడం ద్వారా ప్రేక్షకులను థ్రిల్లింగ్ రైడ్‌లోకి తీసుకువెళుతుంది.

భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పై యానిమల్‌ ని నిర్మిస్తునారు. యానిమల్ 1 డిసెంబర్ 2023న 5 భాషలలో- హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో గ్రాండ్ గా విడుదలౌతుంది.

Also Read:దిల్ రాజు…‘ఆకాశందాటి వస్తావా’

- Advertisement -