Animal:పిల్లలు చూసే సినిమా కాదట

31
- Advertisement -

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన యానిమల్ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘నిజానికి 18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదని, తన కొడుకు అర్జున్, అలాగే తన సోదరుడి పిల్లలను కూడా థియేటర్లలో సినిమాకు తీసుకెళ్లనని స్పష్టం చేశారు. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా యానిమల్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. మొత్తమ్మీద యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు అంటూ సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చింది.

కాగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ విడుదల కానుంది. మరోవైపు న్యాచురల్ స్టార్‌ నాని నటిస్తోన్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. ఈ మూవీ డిసెంబర్‌ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరి కాంబోలో ఓ ఇంటర్వ్యూ షూట్‌ చేయగా.. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో నాని – సందీప్ రెడ్డి వంగా కలిసి ఇంటర్వూస్ చేస్తున్నారు.

Also Read:స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!

- Advertisement -