‘గూఢచారి’ని సొంతం చేసుకున్న అనిల్ సుంకర..

307
- Advertisement -

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గూఢచారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దక్కించుకున్నారు.. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పతాకం అసోసియేషన్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ 4 మిలియన్ వ్యూస్‌తో అందరి దృష్టి ఆకర్షించగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.. ఇప్పటికైతే ఈ విషయం అధికారికంగా ధృవీకరించ లేదు కానీ ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవబోతున్నట్లు తెలుస్తుంది.

Goodachari

యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించగా మొత్తం 116 రోజులలో 158 డిఫరెంట్ లొకేషన్‌లలో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందించబడింది..శశి కిరణ్ తిక్కా దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించగా, 2013 మిస్ ఇండియా అయిన శోభిత ధూళిపాళ టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది..

ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం.. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

- Advertisement -