రామచరణ్‌తో అనిల్ రావిపూడి..!

509
anil ravipudi
- Advertisement -

ఎఫ్‌2,సరిలేరు నీకెవ్వరు సినిమాతో వరుస హిట్ సినిమాలు సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీతో పాటు కమర్షియల్ హంగులు జోడిస్తూ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్న అనిల్ త్వరలో మరో అగ్రహీరోతో సినిమాతో చేయనున్నాడు.

వాస్తవానికి సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎఫ్‌ 2కి సీక్వెల్‌ ఎఫ్‌ 3ని తెరకెక్కిస్తారని ప్రచారం జరిగిన తాజాగా మరో అప్‌ డేట్ టీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. మెగా హీరో రామ్‌చరణ్‌తో మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్ 3 ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టే ఛాన్స్ ఉంది. ఈ లోపు మెగా హీరోతో ఓ ప్రాజెక్ట్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట. రీసెంట్‌గా మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌ని క‌లిసి లైన్ వినిపించ‌గా, దీనికి ఇంప్రెస్ అయిన చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే చేద్ధామ‌ని అన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు చిరు-కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీని నిర్మిస్తున్నాడు రామ్‌ చరణ్. ఈ సినిమాలతో పాటు ప్యార్‌లల్‌గా అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

- Advertisement -