అనిల్ రావిపూడితో ‘నాటకం’ ఫస్ట్ లుక్..!

235
Natakam first look
- Advertisement -

దర్శకుడు అనిల్ రావిపూడి ‘నాటకం’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Natakam first look

సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు.

Natakam first look

నటీనటులు: ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్‌.. సాంకేతిక నిపుణులు :సమర్పిస్తున్న వారు : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి, సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ : గరుడ వేగ అంజి, ఎడిటర్: మణికాంత్,దర్శకుడు : కళ్యాణ్ జి గోగన.

- Advertisement -