వరుణ్ తేజ్, విక్టరీ కాంబినేషన్ లో మల్టిస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు ఎఫ్ 2(ఫస్ అండ్ ఫ్రస్టేషన్ ) అనే టైటిల్ ఖారారు చేశారు. ఈమూవీకి హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వారంరోజుల క్రితం ఈసినిమా షూటింగ్ వరుణ్ తేజ్ పాల్గోనగా నేడు విక్టరీ వెంకటేష్ షూటింగ్ లో పాల్గోన్నాడు. రాజా ది గ్రేట్ సినిమా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి ఈ సినిమాను చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈమూవీలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. ఈచిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక తాజాగా వెంకటేశ్ షూటింగ్ లో పాల్గోన్న విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు.
అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమాలతో విజయం సాధించి టాలీవుడ్ లో సక్సెస్ పుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. పుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈమూవీకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్,దేవి శ్రీప్రసాద్ ఈసినిమాలో పనిచేయడంతో ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. మూడు సక్సెస్ పుల్ సినిమాలు తీసిన అనిల్ రావిపూడి ఈసినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
It's an honour to start working with you sir. #F2 #FunAndFrustration..#VictoryVenkatesh garu….😀😍😍 pic.twitter.com/QqHMvfQUlQ
— Anil Ravipudi (@AnilRavipudi) July 9, 2018