- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంలో పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటారు గజ్వెల్ నియోజకవర్గ హరితసేన ఇంచార్జ్ అనిల్ మొగిలి. ఈ సందర్భంగా అనిల్ మొగిలి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్బంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన మా సిద్దిపేట జిల్లా హరితసేన ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హరితసేన లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మానవ మనుగడకు మరియు సకల జీవ రాషులకు మొక్కల అవసరం ఎంతో ఉంది అన్నారు.

ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలని తనకు ఇంతమంచి అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో హరితసేన సభ్యులు లోకేష్ మొగిలి, శ్రీకాంత్,కొటోజు శ్రీకాంత్, కార్తీక్, శ్రీకాంత్ రావ్, సతీష్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

