తెలంగాణ పథకాలు కాపీ కొట్టడానికే రాష్ట్రానికి మోడీ..

37
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ కు వచ్చేది కెసిఆర్ అభివృద్ధి ,సంక్షేమ పథకాలు చూసి కాపీ కొట్టడానికే అన్నారు ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం. గత తొమ్మిది సంవత్సరాలుగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పర్యటనలు తప్పా, తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ చేసింది ఏమీ లేదని నిలదీశారు.

అటు విభజన హామీలు ఇటు రాష్ట్రానికి రావలసిన వనరులు అన్నింటిలో తెలంగాణ కు అన్యాయమే చేశారని , భారత దేశంలో తెలంగాణ లేదా అనే విధంగా వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిచంద్ భార్య

ప్రధాని మోడీ గారు తెలంగాణ కు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అమలుపరుస్తున్న వినూత్న ప్రజారంజక పథకాల్ని చూసి పోయి ఢిల్లీలో కాపీ కొడుతున్నారని అందుకే ఈ పర్యటలని తెలిపారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని త్వరలో మళ్ళీ వంద స్థానాల్లో బిజెపికి డిపాజిట్ గల్లంతు చేసి బుద్ది చెప్తారని తెలియజేశారు.

Also Read:KTR:ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నాం

- Advertisement -