అమ్మాయి ఎవరితో పడుకుంటే మీకెందుకు…?

223
Andrea
- Advertisement -

హీరోయిన్‌ ఆండ్రియా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె సినిమా గురించి చెబుతూనే ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలిపారు. ముందుగా సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిలు ఎవరితో పడుకుంటుందన్నది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని ఆ విషయంలో వారిని ఎవరూ బలవంతం చేయరాదని అన్నారు. కొద్దికాలంగా పాపులర్ అయిన మీటూ హ్యాష్ ట్యాగ్పై స్పందిస్తూ ఆమె ఈ మాటలన్నారు.

Andrea

తనకు కెరీర్ లో ఎక్కడా లైంగికంగా వేధింపులు ఎదురుకాలేదన్నారు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకుంటానని చెప్పారు. డిటెక్టివ్‌ థ్రిల్లింగ్‌ మూవీ. డైరెక్టర్‌ మిస్కిన్‌ ఓ కల్ట్‌ డైరెక్టర్‌. సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. నవంబర్‌ 10న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకముందని ఆండ్రియా తెలిపింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ‘డిటెక్టివ్‌’ చిత్రం అందులో ఒకటి. అలాగే ‘తారామణి’, ‘గృహం’ చిత్రాలు కూడా ఉన్నాయి. మంచి పాత్రలు వస్తే తెలుగులో కూడా చేయడానికి నేను సిద్ధం’’ అని ఆమె అన్నారు.

- Advertisement -