టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరీంచినప్పటి నుండి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పై చర్చలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, పరిపాలన విధానాలు సత్ఫిలితాలు ఇవ్వడంతో దేశం నలుమూలల నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రా సమాజం కదిలివస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, రావెల కిశోర్‌బాబు, పార్థసారధి తదితర ప్రముఖ నేతలు నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవుతున్నారు.
ఆంధ్రాలో బీఆర్‌ఎస్ వేగంగా విస్తరిస్తుందని అనడానికి ఇదే నిదర్శనమని ప్రముఖ రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. విజయవాడ గూంటుర్ నుంచి ఆంధ్రాప్రాంత నేతలు కార్యకర్తలు వేలాదిగా అభిమానులు కదిలివస్తున్నారు. విజయవాడ హైవే మీదుగా వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే నాయకుడు కరువైన నేపథ్యంలో ఆంధ్రా ప్రజల దృష్టి తెలంగాణ మీద పడింది. తెలంగాణ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నట్టే ఆంధ్రాప్రాంత ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు.
ఆంధ్రా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడి రాజకీయ నేతలు సీనియర్లు జర్నలిస్టులు రిటైర్డ్ ఐఏఎస్‌లు తదితర మేధావి వర్గాలు బీఆర్‌ఎస్‌లో చేరాడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆంధ్రాకు చేందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతుండటంపై ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి…