ఏపీలో ప్రత్యేక హోదా అంశం తరచూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. 2014 విభజన హామీలలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా హామీని అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీయే ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదే సంవత్సరంలో జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హోదా అంశం మెల్లగా మరుగున పడుతూ వస్తోంది. అప్పుడప్పుడు హోదాపై ఏపీ నేతలు గళం విప్పుతున్నప్పటికి మోడి సర్కార్ మాత్రం దాటవేసే దొరణి అవలంబిస్తూ వచ్చింది. ఇక హోదాపై రచ్చ పెరగక ముందే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. దీంతో హోదా రావడం కష్టమే అనేది స్పష్టమౌతోంది. ఇదిలా ఉంచితే తాజాగా ఏపీ సిఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సిఎం జగన్ స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రధానితో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. .
హోదా వల్లనే ఏపీ అభివృద్ది సాద్యమవుతుందని మోడీకి సూచించారట సిఎం జగన్. అలాగే విభజన హామీలు చాలా వరకు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారట. వీటితో పాటు ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు పోలవరం తదితర అంశాలను సిఎం జగన్ ప్రధాని మోడీతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే సిఎం జగన్ ప్రస్తావించిన ఏ ఏ అంశాలను మోడీ కన్సిడర్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించిన స్పెషల్ స్టేటస్ విషయంలో మోడీ సర్కార్ పునః ఆలోచించే అవకాశం లేదనేది కొందరి రాజకీయవాదుల అభిప్రాయం. ఇక పోలవరంకు సంబంధించి ఇప్పటికే చాలా నిధులు విడుదల చేశామని చెప్తున్నా మోడీ సర్కార్.. మళ్ళీ కొత్తగా నిధులు విధుదల చేస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. కాగా మోడీ సర్కార్ కు ఏపీ ప్రభుత్వానికి మంచి సక్యత ఉంది.. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విన్నపాలను మోడీ ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి…