నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈనెల 30వరకు మొత్తం 14రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సభ్యులు కోరితే ఈ సమావేశాలు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉంది. ఉదయం 10గంటలకు సభ ప్రారంభం కానుంది.
ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రేపు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. తొలిరోజున రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ, కరవు పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన, చర్చ ఉంటుంది.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన నిన్న అసెంబ్లీ హాలులో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.