- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చలు ప్రారంభించింది.
అలాగే కొత్తగా ఏడు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది . పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చారా?
- Advertisement -

