ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది (81.14%) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 78.31శాతం, బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని మొత్తం 1,680 పాఠశాలు 100శాతం ఉత్తీర్ణత సాధిచంగా.. 19 పాఠశాలల్లో విద్యార్థులెవరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ యాప్ లో విద్యార్థులు తెలుసుకోవచ్చు.
Also Read:TTD:తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

