ఏపీలో 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు..

388
cm ys jagan
- Advertisement -

ఏపీలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 తర్వాత కౌంటింగ్ ఫలితాలను వెల్లడించనున్నారు.

వైసీపీ నుండి పరిమళ్‌ నత్వాని, మోపిదేవి వెంకటరమణారావు ,ఆళ్ల అయోద్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీ పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు.అయితే నాలుగు స్ధానాలను వైసీపీ దక్కించుకోవడం లాంఛనమే. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 24 స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా 5 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో శుక్రవారం 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో నాలుగు స్థానాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్లే, బీజేపీ నేతలు ఈరన్న కాదడి, అశోక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ఒకే స్థానానికి నాబం రేబియా ఎన్నికయ్యారు.

- Advertisement -