ఏపీలో కొత్తగా 503 కరోనా కేసులు నమోదు..

21

ఏపీలో గడచిన 24 గంటల్లో 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 817 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,268కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,36,865 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,932 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమెదైన కేసులలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు వెల్లడి కాగా, కృష్ణా జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.