Andhra Pradesh: దీపం పథకం బుకింగ్ ప్రారంభం

4
- Advertisement -

ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ సిక్స్‌లో భాగంగా దీపం పథకం బుకింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం లబ్దిదారులు ఆన్‌ లైన్లో, ఆఫ్‌ లైన్లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీపం పథకం కింద ముందు పూర్తి ధరను చెల్లించిన తర్వాత సిలిండర్‌ ఖర్చును లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు.

ప్రతీ కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఒకేసారి మూడు సిలిండర్లు ఇవ్వరు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్‌ను ఇస్తారు. గ్యాస్‌ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.

మొదటి సిలిండర్‌ రాయితీగా రూ. 895 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:Kerala:బాణసంచా పేలుడు..150 మందికి గాయాలు

 

- Advertisement -