ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు..

179
corona in ap
- Advertisement -

ఆంధ్రపదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 60,726 కరోనా టెస్టులు నిర్వహించగా 831 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 145 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 12 కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో 135, తూర్పు గోదావరిలో 126, విజయనగరంలో 18, శ్రీకాకుళం జిల్లాలో 23, కర్నూలు జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,64,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,45,039 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,673 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మరణాల సంఖ్య 6,962కి పెరిగింది.

- Advertisement -