తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రతిభావంతులను పరిచయం చేసే విషయంలో ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పుడూ ముందుంటారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంతే. ప్రతిభ పట్టం కడుతూ కొత్తవారికి స్వాగతం పలుకుతుంది. రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ బాబు పి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త సంగీత దర్శకులను పరిచయం చేస్తున్నారు.
రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోగా RAPO 22కి అధికారికంగా “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ టైటిల్ గ్లింప్స్‌లో ఒక సూపర్‌స్టార్‌కు అంకితభావంతో ఉండే అభిమాని ప్రపంచాన్ని చూపించారు. అభిమానుల అంకితభావాన్ని అద్భుతంగా చిత్రించే వినూత్న కథాంశంతో ఆంధ్ర కింగ్ తాలూకా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తున్నారు. భాఘ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

