ఏపీ సీఎం జగన్ ప్రజా దర్బార్‌కు బ్రేక్ పడింది. జూలై 1 నేటి నుంచి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు జగన్. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
‘ప్రజాదర్బార్’లో భాగంగా ప్రతీ రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి జగన్ ఫిర్యాదులు స్వీకరిస్తారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతనే రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారు జగన్. ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో ప్రజా దర్భార్‌తో ప్రజలతో మమేకయ్యారు. తాజాగా జగన్ సైతం తండ్రిబాటలోనే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు.