కుల దైవమే రక్షించాడు:చంద్రబాబు

8
- Advertisement -

తన కుల దైవం వెంకన్న అని, ఏ సంకల్పం చేసినా ఆయనను తలుచుకుంటానని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 2003లో వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలయిందని చెప్పారు.

ఎన్నో ఎన్నికలు చూశామని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉండాలని రోజూ ప్రార్థిస్తానని అన్నారు. టీటీడీతోనే ప్రక్షాళన మొదలు కావాలని…వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లే తాము ఎన్నికల్లో గెలిచామని చెప్పారు.

వ్యవస్థలో కూడా కుటుంబానికి అంతటి ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం వల్ల రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పారు.

Also Read:కల్కి..దిశా బర్త్ డే స్పెషల్!

- Advertisement -