బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి

355
Anchor-Shwetha-Reddy
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ 3 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3కి వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహిరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేశారు. కొన్ని రోజుల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వెల్లడించనున్నారు. తాజాగా బిగ్ బాస్ 3 షో ప్రారంభంకాకముందే వివాదంలో ఇరుక్కుంది.

ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. బిగ్ బాస్ 3ని నిషేదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తనను బిగ్ బాస్ 3కి ఎంపీక చేసి..చివర్లో ఫోన్ చేసి మిమ్మల్ని రిజెక్ట్ చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు కూడా పెట్టించుకున్నారని తెలిపారు.

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాలంటే బిగ్ బాస్ ను ‘ఇంప్రెస్’ చేయాల్సి ఉంటుందని, అందుకే మీరేం చేస్తారు? అంటూఅంటూ పోగ్రామ్ ఇన్ చార్జ్ దారుణంగా మాట్లాడాడని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో పేరుతో నార్త్ ఇండియా కల్చర్ ను మొత్తం సౌత్ ఇండియాపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -