తెలుగు బుల్లితెర మీద తన మాటలతో, చేతలతో తిరుగులేని యాంకర్ గా గుర్తింపుతెచ్చుకున్నది ఎవరంటే అందరు ఇట్టే చేప్పేస్తారు ఆమె పేరు సుమ అని. సుమ జనమెరిగిన మాటల పుట్ట. మాతృభాష మలయాళమైనా పదహారణాల తెలుగు నేర్చుకుని….యాంకర్లలో స్టార్ మహిళాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ.
ఏడాదిలో ఆమె తీసుకునేరెమ్యూరేషన్ కాస్త అటుఇటుగా.. ఓ స్టార్ హీరోయిన్ రెమ్యూరేషన్ తో సమానం. అది సుమ అంటే. ఇరవై మూడేళ్ల కెరీర్… వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ… ఇలా యాంకర్ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ఇప్పుడు తాజాగా యాంకర్ అవతారమెత్తిన సుమ అందరిని అలరించింది.
సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘విన్నర్’ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేయగా ఆ పాట పాడింది సుమే. అయితే, తనకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పింది సుమ.
ఈ పాట పాడాలని తమన్ తనకి ఫోన్ చేసినప్పుడు .. ఆట పట్టించడానికేమో అనుకుందట. అదే మాటను ఆయనతో అనేసిందట కూడా. “నిజమే మీరు పాడాలి .. ” అంటూ ఆయన పిలిపించడంతో చెన్నైకి వెళ్లానని అంది. అక్కడ ఆయన తనకి లిరిక్ చూపించడం .. తాను పాడేయం చకచకా జరిగిపోయాయని చెప్పింది. తనతో డాన్స్ చేయిస్తే బాగుండదని భావించి అనసూయతో చేయించారేమో అంటూ చమత్కరించింది.
స్టార్ హీరోలన్నాక సంగీత దర్శకులకు, సింగర్స్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం కామన్. కానీ సంగీత దర్శకుడు తమన్ మాత్రం ఇప్పటివరకు హీరో,హీరోయిన్స్‌కే అవకాశాలిస్తు వచ్చాడు. కానీ సుమతో బుల్లితెర భామలకు ఛాన్స్‌లు ఇవ్వడం మొదలెట్టాడు.
‘బిజినెస్ మేన్’ సినిమాలో దర్శకుడు పూరితో పాటు, మహేశ్ బాబు చేత కూడా పాట పాడించి అప్పట్లో ప్రిన్స్ అభిమానులను ఖుషీ చేశాడు. ‘రభస’ సినిమాలో రాకాసి రాకాసి అనే పాటను తారక్ చేత పాడించి రచ్చ చేయించాడు. తమన్. రవితేజతో పవర్ సినిమాలో నోటంకి పాట పాడించి తన పవర్ చూపించాడు తమన్. శృతి హాసన్‌తో ‘ఆగడు’ సినిమాలోనూ శింబు చేత తమిళంలో పలు పాటలు పాడించిన తమన్.. ‘బాద్ షా’, ‘తిక్క’ చిత్రాలతో తెలుగులోనూ పాటలు పాడించాడు.