సుమ అడ్డా.. సవాల్‌ విసురుతోన్న సుమ

115
- Advertisement -

సుమ కనకాల.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన తన చలాకితనం.. హాస్యం, పంచ్‌ డెలివరీతో గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. వారి ఇంటిలో ఒక సభ్యురాలుగా నిలిచిపోయిన సుమ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఛానెల్‌ ఏదైనా ఆమె యాంకరింగ్‌ ఉండాల్సిందే.. ప్రోగ్రాం ఏదైనా.. ఆమె మాటలు ఉండాల్సిందే… సుమ లేనిదే ఏ ప్రోగ్రాం.. ఆడియో ఫంక్షన్‌ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. అప్‌కమింగ్‌ హీరోల నుండి.. సూపర్‌ స్టార్‌ హీరోల దాకా ప్రతి ఆడియో ఫంక్షన్‌ లో యాంకర్‌ గా సుమ ఉండాల్సిందే… అంతగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ స్టార్‌ మహిళ దాదాపు 15 ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌ గా కొనసాగుతోంది. అయితే సుమపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

సుమ త్వరలోనే యాంకరింగ్‌ గుడ్‌ బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి బలాన్నిస్తూ.. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో సుమ కొంతకాలం విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో ఇక సుమ యాంకరింగ్‌ చేయదన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలపై సుమ స్పందిస్తూ.. అదంతా నిజం కాదంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌ స్టా వేదికగా సుమ ఓ కొత్త విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. తాను ఎంటర్‌టైన్‌ మెంట్‌ కోసమే పుట్టానంటూ చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ ఛానెల్‌ లో జనవరి 7 నుంచి ఓ సరికొత్త గేమ్‌ షో ప్రారంభం కాబోతున్నట్లు సుమ తెలిపింది. సుమ అడ్డా పేరుతో ప్రసారం కానున్న ఈ షోకు గెస్ట్ లుగా శేఖర్‌, జానీ మాస్టర్, అలీ, పోసాని కృష్ణ మురళి, సంతోష్‌ శోభన్‌ తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ షో ఏమేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

- Advertisement -