మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి. నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ. ఏ టివి పెట్టినా..ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు. “రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతోంది “సుమ. బుల్లితెరపై మరిన్ని కార్యక్రమాలు చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వీరిద్దరు కలసి అప్పుడప్పుడు సినీ ఫంక్షన్స్‌లో మెరుస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటారు. సుమ -రాజీవ్‌ల జోడీపై టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది.
ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ మాటల పూదోటలోని దంపతులు ఇటీవల జరిగిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి 2 లక్షలు గెలుచుకొని చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. అయితే తాజాగా వీరు గెల్చుకున్న ఆ డబ్బును ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ వారికి డొనేట్ చేశారు. ‘(మా) సభ్యుల్లో ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యం పాలైన వారి కోసం ఈ డబ్బును డొనేట్ చేశామని, వారికి ఈ డబ్బును సహాయంగా అందించడం చాలా ఆనందంగా ఉందని’ సుమ తన పేస్బుక్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్బంగా సుమ రాజీవ్ కలసి (మా) అధ్యక్షులకు చెక్ అందజేస్తున్నప్పటి ఫోటోను పోస్ట్ చేసింది.