కేటీఆర్‌ను కలిసిన యాంకర్ సుమ..

261
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రముఖ యాంకర్ సుమ కలిశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్‌కు తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం యాంకర్ సుమ.. కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

KTR

ఈ సందర్భంగా కేటీఆర్‌కు సుమ ఒక మొక్కను బహుకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓ మంచి పని కోసం ఆయన మద్దతు అడిగానని, సమయం వచ్చినప్పుడు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కేటీఆర్‌కు అభినందనలు తెలిపానని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందని సుమ ప్రశంసించారు.

- Advertisement -