త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 12వ సీజన్‌కు అన్ని జట్ల ఆటగాళ్లు సిద్ధమౌతున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. ఈనెల 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. అంతేకాదు తీరిక సమయంలో యాడ్ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సుమతో కలిసి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ సందడి చేశారు. ఓ టీవీ యాడ్‌లో కోసం సన్‌రైజర్స్ జట్టు సభ్యులతో కలిసి సుమ అలరించారు.
అయితే యాడ్‌లో భాగంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన వడల, మినప గారెలను ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్ కు రుచిచూపించింది సుమ. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ యాడ్‌లో తీస్తున్న సమయంలో రుచికరమైన వంటకాలను రుచి చూశాడు. ఇక సన్ రైజర్స్ జట్టుకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ యాడ్ ష్యూటింగ్లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను యంకర్ సుమ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
It was fun working with @SunRisers . All the best to our team. pic.twitter.com/ikoA7aeoTE
— Suma Kanakalla (@ItsSumaKanakala) March 19, 2019