గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్ శ్యామల..

98
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్యామల గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపొందించిన వృకవేదం పుస్తకం చాలా బాగుందని తనకు బహుకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు మొక్కలు నాటడం అంటే ఇష్టమని తెలిపారు. ఇలాంటి కార్యక్రముంలో పాల్గొనేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం నితిన్,వెన్నెల కిషోర్ ,గీతా మాధురి ముగ్గురికి గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు శ్యామల.

- Advertisement -