బిగ్ బాస్3 లోకి తీన్మార్ సావిత్రి

593
savithri
- Advertisement -

బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. సెలబ్రెటిలు అందరూ కలిసి ఒకే చోట ఉండటం ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇక తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈషో త్వరలోనే మూడవ సీజన్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈషోకు సంబంధించిన రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈషో లో పాల్గోనే పార్టిసిపెంట్స్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. అందులో మొదటగా శ్రీముఖి పేరు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. అందుకే శ్రీముఖి కొద్ది రోజుల నుంచి పటాస్ షో కనిపించడం లేదు. ఇక మరో ఇంట్రస్టింగ్ యాంకర్ కూడా ఈషో లో పాల్గోననున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసే తీన్మార్ సావిత్రి ఈషోలోకి రానున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెతో చర్చించినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో యాంక‌ర్ శ్యామ‌ల చేసిన హంగామా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కారణంగా.. ఈ సారి తెలంగాణ పిల్ల యాంకర్ సావిత్రితో అంతకుమించిన హంగామా చేయించాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు.

- Advertisement -