డబుల్ మీనింగ్ డైలాగ్స్‌.. రష్మి క్లారిటీ

263
Anchor reshmi react on double meaning dialogue
- Advertisement -

రష్మీ గౌతమ్.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘జబర్దస్త్ కామెడీ షో’లో యాంకర్ గా పనిచేస్తూ ఆడియెన్స్ లో క్రేజ్‌ తెచ్చుకున్న రష్మీ.. వెండితెరపై కూడా తన నటనతో రెచ్చిపోతోంది.

ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించిన రష్మీ, ఆ సినిమాలో అందాల ఆరబోతకు వెనుకాడలేదు. బుల్లితెరపై చూపించే అందాలకు ఫిదా అయిన యూత్‌.. వెండితెరపై అంతకు మించి అందాలను చూడగానే ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Anchor reshmi react on double meaning dialogue

అయితే అదే క్రేజ్‌ ను కంటిన్యూ చేస్తోన్నరష్మి తాజాగా ‘నెక్ట్స్ నువ్వే’ అంటూ వచ్చేస్తోంది. ‘నెక్ట్స్ నువ్వే’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న రష్మీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ కి హాజరైంది. ఆ సినిమాల్లో తన చేత డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించడం, ఎక్స్ పోజింగ్ చేయించడం.. వంటి అంశాలపై స్పందించింది.

ఈ సినిమా ట్రైలర్ లో రష్మి చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు వింటే దిమ్మతిరిగిపోవాల్సిందే. అయితే..అలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం తన వ్యక్తిగతం కాదు కానీ, సందర్భానుసారం దర్శకులు, రచయితలు చెప్పినట్టుగానే చేయాల్సి వస్తుందని, వారు రాసిన డైలాగులనే పలకవలసి వస్తుందని రష్మీ ఇంటర్వ్యూ లో స్పష్టం చేసింది. సినిమాల్లో డబుల్ మీనింగ్స్ పలకడం అంటే అది పాత్ర వరకే కానీ, తమ వ్యక్తిగతానికి సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది.

 Anchor reshmi react on double meaning dialogue

ఇక తను చేసే ఎక్స్ పోజింగ్ విషయంలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తను 30 శాతం మాత్రమే స్కిన్ షో చేశానని , అంతకు మించి చేయలేదని వ్యాఖ్యానించింది. ఇక సినిమా హీరోయిన్లు బికినీ ధరించడం ఈ రోజుల్లో చాలా సహజమే అంటూ కూడా చెప్పుకొచ్చింది జబర్థస్త్‌ భామ.

- Advertisement -