బుల్లితెరపై ఒకప్పుడు మారుమోగిన యాంకర్స్ పేరు రవి,లాస్య వీరిద్దరు బుల్లితెర పై చేసే యాంకరింగ్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఎక్కడికి వెళ్లిన రవి అంటే లాస్య, లాస్య అంటే రవిగా గుర్తింపు పొందారు. గతంలో వీరిద్దరికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి. గత రెండు సంవత్సరాల నుంచి రవి, లాస్య లు కలిసి షో చేయడం లేదు. ఎందుకంటే వారిద్దరి మధ్య విభేదాలే కారణం అని ఒకరు కాదు రూమర్స్ వల్లే విడిపోయి వేరే వేరు షోలు చేసుకుంటున్నారని మరొకరు చెబుతున్నారు. అయితే ఇందులో ఏ విషయం నిజం అనేది మాత్రం తెలియడం లేదు.
అయితే తాజాగా రవిపై లాస్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. రవికి పెళ్లి అయినా కూడా తనతో ప్రేమను కోరుకున్నాడు అంటూ లాస్య చెప్పడంతో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లాస్య ఇటీవలే మంజునాథ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే లాస్యకు పెళ్లి అయిన వెంటనే రవి తనకు అత్యంత సన్నిహితులతో మాట్లాడుతూ లాస్యతో తాను అన్ని షేర్ చేసుకున్నాను, చివరకు ఆమెతో బెడ్ కూడా షేర్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడట. మొదట లాస్య తనను ప్రేమించినట్లుగా చెప్పిందని, ఆ తర్వాత తాను కూడా లాస్యతో ప్రేమలో పడ్డానని రవి అన్నాడట. తాను ఎప్పుడు లాస్యను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని, అయితే ఆమె మాత్రం ఉన్నట్లుండి ఎందుకు ఇలా ప్లేటు ఫిరాయించిందో అర్థం కావడం లేదు అంటూ రవి సన్నిహితుల దగ్గర వాపోయిడట.
మొత్తం మీద లాస్య పెళ్లైన కూడా ఆమెను రవి వ్యవహారం మాత్రం తన నీడల వెంటడుతుంది. అయితే రవి చేసిన ఈఆరోపణలపై లాస్య స్పందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే మరి.