కాస్టింగ్ కౌచ్ : ఆశపడ్డాక..లొల్లెందుకు..? కుండబద్దలుకొట్టిన రష్మి

397
Casting Couch
- Advertisement -

టాలీవుడ్‌ హాట్‌ యాంకర్‌ రష్మిగౌతమ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ న్యూస్‌ బ్రాండ్‌గా మారుతోంది. తనదైన శైలీలో స్పందిస్తూ..సంచలన వ్యాఖ్యలుచేస్తోంది. ‘అంతకు మించి’లో థైస్‌తో త్రిల్‌ చేసిన రష్మికి యూత్‌ ఫిదా అయ్యారు. అయితే రీసెంట్‌ గా ‘అంతకు మించి’ ప్రమోషనల్ ఈవెంట్ లో కాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందించింది రష్మి.

Anchor Rashmi

కాస్టింగ్‌ కౌచ్ పై తనకు ఎదురైన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానాలిచ్చింది ఈ హాట్‌ యాంకర్. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఓ ఛాయిస్‌ అని, కెరీర్‌ బాగుంటుంది అనిపిస్తే…అలాంటివి ఒప్పుకోవడంలో తప్పేమీ లేదంటూ చెప్పుకొచ్చింది. ఇలా చెబుతూనే…అది ఇద్దరి వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే జరిగినప్పుడు దాన్ని కాస్టింగ్‌ కౌచ్‌ గా ఎలా చెప్పగలమని బాంబ్‌ పేల్చేసింది.

అంతేకాకుండా అవకాశాలకు ఆశపడి వెళ్ళిన తర్వాత, మళ్లీ బయటకొచ్చి గొడవచేయడమేంటని కుండబద్దలుకొట్టింది. ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ.. సినిమా ఇండస్ట్రీనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని ఆరోపించింది. అయతే తనతో మాత్రం ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. ఇక రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

 Anchor Rashmi

‘అంతకుమించి’ తర్వాత రష్మి నోటినుంచి అంతకంటే ఎక్కువ మాటలే బయటకొస్తున్నాయి. కొంపదీసీ…రష్మి , బ్రేకింగ్‌న్యూస్‌కి బ్రాండ్‌అంబాసిడర్ గా మారి, ట్రెంట్ సెట్‌ చేసినా చేస్తుందేమో.

- Advertisement -